గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన నల్లగొండ ఆర్.డీ.ఓ. జగదీశ్వర్ రెడ్డి

హరిత తెలంగాణే లక్ష్యంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం అప్రతీహతంగా ముందుకు సాగుతున్నది. మెక్కల ఆవశ్యతను తెల్పూతూ ప్రజల్లో స్పూర్తిని నింపేలాగా సెలబ్రేటీలు, ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి మూడు మెక్కల్ని నాటి మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ ను విసురుతున్నరు.
గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా టిఆర్ యస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించి నల్లగొండ ఆర్.డీ.ఓ. జగదీశ్వర్ రెడ్డి తన ఇంటి ఆవరణలో మూడు మెక్కల్ని నాటారు. మరో ముగ్గురు వికారాబాద్ ఆర్.డీ. ఓ ఉ.పేందర్ రెడ్డికి, సిద్దిపేట ఆర్.డీ.ఓ. అనంత రెడ్డికి, ఆర్మూర్ ఆర్.డీ.ఓ. శ్రీనివాస్ లకు గ్రీన్ ఛాలెంజ్ ను జగదీశ్వర్ రెడ్డి విసిరారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ చాలా గొప్ప కార్యక్రమమని, ప్రజల్లో స్పూర్తిని నింపుతూ ముఖ్యమంత్రి కెసీఆర్ కలలు కన్న హరిత తెలంగాణాకు ఎంతగానో దోహదం పడ్తున్నదని ఆర్.డీ.ఓ. జగదీశ్వర్ రెడ్డి అన్నారు. మెక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి భాద్యత అని ఆయన అన్నారు.