పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల కమిటీ సభ్యుడిగా ఎన్‌ఆర్‌ఐ మహేష్ బిగాలా నియమితులయ్యారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ మహేష్ బిగాల పేరును ప్రకటించారు. 51 దేశాల ఎన్‌ఆర్‌ఐలతో మంత్రి కేటీఆర్ నేడు సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… తెలుగువారి ఖ్యాతి ఖండాంతరాలకు తెలిసేలా చేసిన మహనీయుడు పీవీ నరసింహారావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల నిర్వహణ తలపెట్టిందన్నారు. ఈ నెల 28న పీవీ శత జయంతిని ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరపాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఏడాది పొడుగునా పీవీ శత జయంతి ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.
