అమోనియా గ్యాస్ లీకై ఒకరు మృతి చెందిన ఘటన ఏపీలోని కర్నూల్ జిల్లా నంద్యాలలో ఎస్పివై ఆగ్రో ఇండస్ట్రీస్‌లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, అంబులెన్స్, పోలీసులు హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది.. పరిశ్రమ లోపల ఉన్న కార్మికులను బయటకు తీసుకువస్తున్నారు. మరోవైపు గ్యాస్ లీక్‌తో స్థానికుల్లో భయాందోళ నెలకొంది. కాగా, ఇటీవల విశాఖపట్టణంలో జరిగిన గ్యాస్ లీకేజ్ ఘటనలో దాదాపు 12మంది చనిపోయిన విషయం తెలిసిందే.
