గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన నటి, యాంకర్ హిమజ

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా యాంకర్ శివజ్యోతి ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు జూబ్లీహిల్స్ లో మొక్కలు నాటిన ప్రముఖ నటి, యాంకర్ హిమజ.
ఈ సందర్భంగా హిమజ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ సమాజంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా పచ్చదనం పెంచడం కోసం ఈ మొక్కలు నాటే కార్యక్రమం తీసుకున్నారని ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. నాకు కూడా మొక్కలు అంటే చాలా ఇష్టమని నేను సమయం దొరికినప్పుడల్లా మొక్కలు నాటుతాను. ఈ రోజు నేను ఇక్కడ మూడు మొక్కలు నాటడం జరిగిందని నాటిన మొక్కలకు మూడు పేర్లు పెట్టుకుంటున్నాను రాముడు, సీత, లక్ష్మణుడు వీరు ఎప్పుడూ కలిసి మెలిసి ఉంటారు. కాబట్టి ఈ మొక్కలు కూడా అదే విధంగా కలిసి పెరగాలని కోరుకుంటూన్నాను. ప్రజలందరూ కూడా ఇదే విధంగా వారికి తోచిన విధంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నేను మరొక ముగ్గురిని నందిత రాయి, ప్రణవి మానుకొం, భాను కూడా మొక్కలు నాటాలని కోరారు.