రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా హీరో నందు ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు దుండిగల్ లో మొక్కలు నాటిన సవారీ చిత్రం హీరోయిన్ ప్రియాంక శర్మ.
ఈ సందర్భంగా హీరోయిన్ ప్రియాంక శర్మ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనేది ఒక మంచి కార్యక్రమం అని అందులో నేను కూడ పాల్గొని మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆమె మరోక ఐదుగురిని శ్రీకాంత్ రెడ్డి, జీవన్ కుమార్, లిప్ సికా (lipsika), సైరోకా(saironka), దినేష్ తేజ లను మొక్కలు నాటాలని కోరారు.