మున్సిపల్‌ ఎన్నికల పరిశీలకులుగా ఐఏఎస్‌ అధికారులు

మున్సిపల్‌ ఎన్నికల పరిశీలకులుగా ఐఏఎస్‌ అధికారులను నియమిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. 31 జిల్లాల్లో ఎన్నికలకు 27 మంది ఐఏఎస్‌ అధికారులను నియమించారు. అభ్యర్థుల వ్యయ పరిశీలన కోసం ప్రత్యేకంగా పరిశీలకులను నియమించారు.
ఆదిలాబాద్‌, నిర్మల్‌ పరిశీలకులుగా శ్రుతి ఓజా, కుమురం భీం జిల్లా – కృష్ణ ఆదిత్య, మంచిర్యాల – బి గోపి, జగిత్యాల – బి. విజియేంద్రరాజన్న, సిరిసిల్ల – మహ్మద్‌ అబ్దుల్‌, అజీజ్‌సిద్దిపేట- హరి చందన దాసరి, కరీంనగర్‌- అద్వైత్‌ కుమార్‌, పెద్దపల్లి- ప్రావిణ్య, భద్రాద్రి కొత్తగూడెం – కె. నిర్మల, ఖమ్మం- విపి గౌతమ్‌, జోగులాంబ గద్వాల, వనపర్తి, – పమేల సత్పతి, మహబూబ్‌నగర్‌, నారాయణపేట – సత్య శారదాదేవి, మెదక్‌ – జితేశ్‌ వి. పాటిల్‌, సంగారెడ్డి – అలుగు వర్షిణి, నల్లగొండ- పి. ఉదయ్‌కుమార్‌, సూర్యపేట – ఎం చంపాలాల్‌, యాదాద్రి భువనగిరి – సిక్తా పట్నాయక్‌, మేడ్చల్‌- ఎల్‌ శర్మన్‌, కామారెడ్డి – సందీప్‌కుమార్‌ ఝా, నిజామాబాద్‌ – ముషారఫ్‌ అలీ ఫారుఖీ, రంగారెడ్డి – కె.వై నాయక్‌, వికారాబాద్‌ – కె. హైమావతి, జయశంకర్‌ భూపాలపల్లి – బధావత్‌ సంతోష్‌, జనగామ – కొర్రా లక్ష్మి, మహబూబాబాద్‌ – హనుమంత్‌ కొడిబ, వరంగల్‌ గ్రామీణం – గొర్రెల సువర్ణ పాండాదాస్‌, నాగర్ కర్నూల్ జిల్లా – పౌసోమి బసు