గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్.

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ జోగినిపల్లి ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ చెంగిచెర్లలో మొక్కలు నాటిన డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్.
ఈ సందర్భంగా కొత్త లక్ష్మి రవి గౌడ్ మాట్లాడుతు ఇంత గొప్ప కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.