తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా వైరస్ పాజిటీవ్ వచ్చింది. ఆస్తమా ఉండటంతో ముందు జాగ్రత్తగా మూడు రోజుల క్రితం మంత్రి మహమూద్ అలీని కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో ఆయనకు వైద్యులు కరోనా పరీక్ష నిర్వహించారు. అయితే, పరీక్ష ఫలితాల్లో పాజిటీవ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం మంత్రి మహమూద్ అలీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మరోవైపు హైదరాబాద్ కేంద్ర సమాచార శాఖలో కరోనా కలకలం రేపుతోంది. కవాడిగూడ సీజిెస్ టవర్స్ లోని పిఐబి కార్యాలయంలో అడిషనల్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, కొందరు ఉద్యోగులకు సహా ఐదుగురికి కరోనా సోకింది. దీంతో కార్యలయంలోని మిగతా ఉద్యోగలకు అధికారులు కరోనా పరీక్షలు చేస్తున్నారు. కేసులు నమోదయ్యాయి.