
సైబరాబాద్ కమిషనరేట్‌లో సైబరాబాద్ హోంగార్డు మ్యూచువల్ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ త్రిఫ్ట్ అండ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్‌ను శుక్రవారం సీపీ సజ్జనార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మొదటిసారిగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హోంగార్డుల కోసం ఒక సొసైటీ ఏర్పాటు కావడం హర్షణీయమన్నారు. ఈ సొసైటీ సైబరాబాద్‌లో ప్రతి హోంగార్డుకు తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. ఈ సొసైటీతో 1049 మంది హోంగార్డులకు లబ్ధి చేకూరుతుందని, ప్రతి హోంగార్డుకు రూ.50వేల వరకు రుణం పొందవచ్చని, దానిని 50 వాయిదాలలో నాలుగేండ్ల వరకు చెల్లించేందుకు అవకాశముంటుందన్నారు. సమావేశంలో డీసీపీలు విజయ్‌కుమార్, అనసూయ, అధికారులు పాల్గొన్నారు.