అన్ని యూనివర్సిటీల్లో విరివిగా మొక్కలు నాటాలి – తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ పాపిరెడ్డి

రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ పాపిరెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో సోమవారం మొక్కలు నాటారు. తెలంగాణ గ్రంథాలయ పరిషత్‌ చైర్మన్‌ డాక్టర్‌ అయాచితం శ్రీధర్‌ విసిరిన చాలెంజ్‌ను స్వీకరించి మొక్కను నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని యూనివర్సిటీల్లోనూ విరివిగా మొక్కలు నాటాలని సూచించారు. ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్లు ప్రొఫెసర్‌ లింబాద్రి, ప్రొఫెసర్‌ వెంకటరమణ, కార్యదర్శి డాక్టర్‌ శ్రీనివాస్‌, ఓయూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ గోపాల్‌రెడ్డి, ఓఎస్డీ ప్రొఫెసర్‌ కృష్ణారావు, గ్రీన్‌ బెల్ట్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ చంద్రు, గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ సహవ్యవస్థాపకుడు రాఘవ, ప్రతినిధి కిశోర్‌గౌడ్‌ పాల్గొన్నారు.