ఇద్దరు ఏపీ మంత్రుల రాజీనామా

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు మంత్రులు  మోపిదేవి వెంకట రమణ, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ తమ పదవులకు రాజీనామా చేశారు. తమ రాజీనామా పత్రాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు అందజేశారు. అదే విధంగా ఎమ్మెల్సీ పదవులకు కూడా రాజీనామా చేసి రాజీనామా  లేఖలను మండలి కార్యదర్శికి అందజేశారు.

ఇటీవల ఏపీ నుంచి ఎన్నికైన నలుగురిలో వీరిద్దరూ రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఎమ్మెల్సీ, మంత్రి పదవులకు  రాజీనామా సమర్పించారు.. ఈ సందర్భంగా పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ మాట్లాడుతూ.. పార్లమెంట్‌కు వెళ్లాలన్నది తన చిరకాల కోరికని,  ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చొరవతో అది నెరవేరిందని అన్నారు. టీడీపీ నుంచి వచ్చిన తనకు మంత్రి పదవి ఇచ్చి గౌరవించినందుకు జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు.