ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కలకలం కొనసాగుతున్నది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 657 కరోనా పాజిటివ్‌లుగా తేలగా, ఆరుగురు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 15,252కి చేరగా, ఇప్పటివరకు 193 మంది మరణించారు. రాష్ట్రంలోని మొత్తం కరోనా బాధితుల్లో 6988 మంది కోలుకోగా, 8071 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
గడిచిన 24 గంటల్లో నమోదైన కేసుల్లో 39 మంది ఇతర రాష్ర్టాలకు చెందినవారు కాగా, ఏడుగురు ఇతర దేశాల నుంచి వచ్చినవారు ఉన్నారు. రాష్ట్రంలో నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పటివరకు 28,239 మందికి టెస్టులు చేయగా, మొత్తం 9,18,429 మంది కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు అత్యధికంగా కర్నూలులో 2045 కేసులు నమోదవగా, అనంతపురంలో 1689, కృష్ణాలో 1519, గుంటూరులో 1426, పశ్చిమగోదావరిలో 1209, చిత్తూరులో 1089 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.