ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. తాజాగా ఏపీ సచివాలయ, అసెంబ్లీ ఉద్యోగులకు కరోనా నిర్ధారణ కలకలం రేపుతుంది. గత నెల 25న సచివాలయ, అసెంబ్లీ ఉద్యోగులందరీకీ కరోనా పరీక్షలు నిర్వహించారు.
ఈ పరీక్షల్లో అసెంబ్లీలో ఇద్దరికి, సచివాలయంలో10 మందికి, జలవనరుల శాఖలో ముగ్గురికి, పశుసంవర్ధక శాఖలో ఒకరికి కరోనా నిర్ధారణ అయ్యింది. ఇప్పటివరకు సచివాలయం, అసెంబ్లీలో పనిచేస్తూ కరోనా బారిన పడ్డ ఉద్యోగుల సంఖ్య 27కు చేరుకుంది . కరోనా నిర్ధారణ అయిన ఉద్యోగులతో సన్నిహితంగా మెలిగిన వారు ఇంటి నుంచే విధులు నిర్వహించాలని గురువారం ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. వీరి ఆదేశాల మేరకు గురువారం పలువురు ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి ఇంటికి వెళ్లిపోయారు.