హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు ధ్వంసమైన ఘటనలో ఓ గ్రామ సర్పంచ్ సస్పెండ్ అవగా ఇద్దరు అధికారులకు మెమోలు జారీ అయ్యాయి. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. మొక్కల ధ్వంసం అంశంలో నర్సింగాపూర్ గ్రామ సర్పంచ్ గంగాధర్‌ను కలెక్టర్ ఆరు నెలల పాటు సస్పెండ్ చేశారు. మొక్కలు ధ్వంసం అంశంలో సరైన వివరణ ఇవ్వలేదని సర్పంచ్‌పై చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా మొక్కల ధ్వంసంపై సకాలంలో తెలపనందుకు అధికారులకు మెమోలు జారీచేశారు. చందుర్తి ఎంపీడీవో రవీందర్, ఏపీవో ప్రదీప్‌కుమార్‌కు కలెక్టర్ మెమోలు జారీచేశారు. ఉపసర్పంచ్ కాసారపు ఉపేందర్‌కు బాధ్యతలు అప్పగించారు.
