కంటోన్మెంట్‌ అభివృద్ధిపై మంత్రి హరీశ్‌రావు సమీక్ష

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డులో జరుగుతున్న అభివృద్ధి పనులు, ఇతర సమస్యలపై ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మల్లారెడ్డి, కంటోన్మెంట్‌ సీఈఓలు చంద్రశేఖర్‌, అజిత్‌రెడ్డి, బోర్డు సభ్యులు, ఇతరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్‌ సమస్యలపై నేడు రెండో రోజు సమావేశం జరుగుతుంది. నిన్న మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.