ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ రమేష్ కుమార్‌ను నియమిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ప్రకటించారు. ఈ మేరకు ఆమె గురువారం నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా రేపాల శ్రీనివాసరావును నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. 1986 బ్యాచ్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఐఏఎస్ అధికారిగా రమేష్ కుమార్ పని చేసి 2017లో రిటైర్ అయ్యారు. కడప జిల్లాకు చెందిన రమేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సమాచార ప్రధాన కమిషనర్‌గా నియమితలవుతున్న తొలి వ్యక్తి.
