- ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడినందుకు సీఎఫ్‌వో, ఇతరులపై విధించిన సెబీ
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ దివీస్ ల్యాబోరేటరీస్‌కు మార్కెట్ నియంత్రణ మండలి సెబీ గట్టి షాకిచ్చింది. 2017లో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌నకు పాల్పడినందుకు ఆ కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ అధికారి ఎల్. కిశోర్‌బాబు, ఆయన కుమారుడు, వారి సన్నిహితులకు రూ.96 లక్షల జరిమానా విధించింది. కిశోర్‌బాబు, ప్రవీణ్ లింగమనేని, నగేశ్ లింగమనేని, శ్రీలక్ష్మీ లింగమనేని, డీ శ్రీనివాసరావు, రాధికా ద్రోణవల్లి, గోపిచంద్ లింగమనేని, పుష్పలతాదేవిప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడినిట్లు విచారణలో తేలిందని, దీంతో వారిపై జరిమానా విధించామని సెబీ ఒక ప్రకటనలో వెల్లడించింది. వైజాగ్‌లో ఉన్న యూనిట్-2పై అమెరికా నియంత్రణ మండలి యూఎస్‌ఎఫ్‌డీఏ విధించిన 99-32 అలర్ట్‌ను ఎత్తివేస్తున్నట్లు మార్కెట్ నడుస్తున్నప్పుడే ప్రకటించినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టిన సెబీ.. ఇది నిజమని గురువారం తేల్చింది.