రాయగిరిలో రూపుదిద్దుకున్న నర్సింహ, ఆంజనేయ అరణ్యాలు
నేడు ప్రారంభించనున్న మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి
ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న యాదాద్రి నారసింహుడి క్షేత్రం అటు భక్తులు, ఇటు స్థానికులకు మరింత ఆహ్లాదాన్ని పంచేందుకు సిద్ధమైంది. క్షేత్రానికి సమీపంలోని రాయగిరి రిజర్వ్‌ఫారెస్ట్ ఏరియాలో ఏర్పాటుచేసిన నర్సింహ అరణ్యం, ఆంజనేయ అరణ్యం అర్బన్ ఫారెస్ట్పార్కులు ప్రారంభోత్సవానికి ముస్తాబయ్యాయి. రాయగిరి-2 రిజర్వ్ ఫారెస్ట్‌బ్లాక్‌లో 4కిలోమీటర్ల విస్తీర్ణం.. 97.12హెక్టార్లలో 3.61కోట్ల వ్యయంతో నర్సింహ అరణ్యం, రాయగిరి-1 రిజర్వు ఫారెస్ట్‌బ్లాక్‌లో 3.6 కిలోమీటర్ల విస్తీర్ణం.. 56.65 హెక్టార్లలో రూ.2.83 కోట్ల వ్యయంతో ఆంజనేయ అరణ్యం అర్బన్‌ఫారెస్ట్ పార్కులను అటవీ శాఖ సర్వాంగసుందరంగా తీర్చిది ద్దింది. వీటిని శుక్రవారం మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి ప్రారంభించనున్నారు.