గ్రీన్ ఇండియా ఛాలంజ్ లో భాగంగా మొక్కలు నాటిన మల్లాపూర్ సహకార బ్యాంకు చైర్మన్ దుర్గారెడ్డి

మొక్కలు నాటిన మల్లాపూర్ సహకార బ్యాంకు చైర్మన్ దుర్గారెడ్డి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ సభ్యులు వొరగంటి ఆనంద్ విసిరినా చాలెంజ్ స్వీకరించి ఈరోజు మల్లాపూర్ సహకార బ్యాంకు ఆవరణలో బ్యాంకు చైర్మన్ దుర్గారెడ్డి మొక్కలు నాటడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు, హరిత తెలంగాణగా నిర్మించడానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన ఈ చాలెంజ్ ప్రపంచ దేశాల్లోని తెలంగాణ వారు కూడా స్వీకరించారని గుర్తు చేశారు.
అలాగే వారు మరో ముగ్గురికి కొత్తపేట మాజీ సర్పంచ్ నర్సింహా రావుకి, మల్లాపూర్ సర్పంచ్ శంకర్ కి, ఎంపిటిసికి తను చాలెంజ్ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువకులు తదితరులు పాల్గొన్నారు.