ఆకుపచ్చ తెలంగాణే సీఎం కేసీఆర్ ధ్యేయం – ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు

ఆకు పచ్చని తెలంగాణే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, ప్రతిఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. పాల్వంచ మండలంలోని బసవతారకం కాలనీలో శుక్రవారం ఆయన 6వ విడత హరితహారంలో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ తమ గృహాల్లో అన్ని పండ్ల మొక్కలను నాటుకోవాలని, పర్యావరణ పరిరక్షణకు భావితరాలకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. టీఆర్‌ఎస్ నాయకుడు వనమా రాఘవేంద్రరావు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, తహసీల్దార్ భగావాన్‌రెడ్డి, ఎంపీడీఓ అల్బర్ట్, సొసైటీ ఉపాధ్యక్షుడు కాంపెల్లి కనకేశ్, ఐసీడీఎస్ సీడీపీఓ కనకదుర్గ, ఎంపీటీసీ మద్దెల వీరమోహన్వ్రు, సర్పంచ్ జర్పుల కాశమ్మ, కార్యదర్శి సబిత, లక్ష్మీదేవిపల్లి సర్పంచ్ విజయ్, ఉపసర్పంచ్ వేముల రాజశేఖర్, మాసీ సర్పంచ్ కొర్రా రాములు, ఎస్వీఆర్‌కే ఆచార్యులు, బండి లక్ష్మణ్, కాల్వ భాస్కర్, మల్లెల శ్రీరామ్మూర్తి, బండి చిన్న వెంకటేశ్వర్లు, చింతా నాగరాజు, కందుకూరి రాము, పప్పు సుబ్బారావు, హర్ష, సత్తి, హీరాలాల్, మదార్, బొందిలి హరి తదితరులు పాల్గొన్నారు.