తెలంగాణలో కొత్తగా 1892 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ ఉగ్రరూపం దాలుస్తోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రంలో 1,892 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇంత పెద్దసంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా 87.6 శాతం కేసులు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే నమోదయ్యాయి. శుక్రవారం నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య 20,462కు చేరింది. ఇందులో 9,984 మంది చికిత్స పొందుతున్నారు. 10,195 మంది కోలుకున్నారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 8 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. దీంతో కరోనా కారణంగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 283కు చేరింది.