గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన జగిత్యాల ఎమ్మెల్యే ఎం సంజయ్ కుమార్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు తన జన్మదినం సందర్బంగా జగిత్యాల ఎమ్మెల్యే ఎం సంజయ్ కుమార్ తన నియోజకవర్గంలో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే ఎం.సంజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి పుట్టినరోజుకు ప్రతి ఒక్కరు ఒక్క మొక్క నాటిన మన జీవితంలో మనం 100 మొక్కలు మన ప్రకృతికి అందించిన వాళ్ళం అవుతాం. కేవలం సీఎం కేసీఆర్ చేపట్టిన మహత్తర కార్యక్రమం హరితహారం వల్ల, అడవుల నరికివేతను అరికట్టడం వల్ల, ఈరోజు జగిత్యాలలో కొండలు, గుట్టలు, పరిసర ప్రాంతలు పచ్చగా , ఎంతో ఆహ్లదకర వత్గావరణం కల్పిస్తున్నాయి. ఈరోజు మొక్కలు నాటడం నాకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. రోజు రోజుకు పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని తన నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.