భవిష్యత్తరాలకు ఆర్యోగకరమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా హరితహారం కార్యక్రమం కొనసాగుతున్నదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్‌లో బుధవారం చేపట్టిన హరితహారంలో భాగంగా మంత్రి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మేడ్చల్ జిల్లాలో రెండు కోట్ల మొక్కలు నాటేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి లక్ష్యాన్ని నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నేత మర్రి రాజశేఖర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భాస్కర్‌యాదవ్, మేడ్చల్ మున్సిపల్ చైర్పర్సన్ దీపికా నర్సింహారెడ్డి, వైస్‌చైర్మన్ రమేశ్, ఎంపీపీ పద్మాజగన్‌రెడ్డి, జడ్పీటీసీ శైలజా విజయేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
