దేశంలో ఒక్క రోజే 24,879 కేసులు

 ఇండియాలో క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య దూసుకెళ్లుతున్న‌ది.  గ‌త 24 గంట‌ల్లో అత్య‌ధికంగా 24,879 మందికి క‌రోనా వైర‌స్ సంక్ర‌మించింది.   మ‌రో వైపు 24 గంట‌ల్లోనే 487 మంది మ‌ర‌ణించారు.  దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల 7,67,296కు చేరుకున్న‌ది.  మొత్తం యాక్టివ్ కేసులు 269789 ఉన్నాయి.  వైర‌స్ నుంచి 476378 మంది కోలుకున్నారు.  దేశ‌వ్యాప్తంగా వైర‌స్ వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య 21129గా ఉన్న‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది.