దేశంలో కరోనా తీవ్రత అధికమవుతున్నది. మహమ్మారి విజృంభనతో గత వారం రోజులుగా దేశంలో 25 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోవదవుతున్నాయి. తాజాగా రికార్డు స్థాయిలో గత 24 గంటల్లో కొత్తగా 28,701 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 8,78,254కు చేరింది. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 3,01,609 కేసులు యాక్టివ్‌గా ఉండగా, మరో 5,53,471 మంది బాధితులు కోలుకున్నారు. నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు కరోనా వల్ల 500 మంది మరణించారు. దీంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 23,174కు పెరిగింది. గత 24 గంటల్లో 18850 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది.
జూలై 12 వరకు 1,18,06,256 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) ప్రకటించింది. నిన్న ఒకేరోజు 2,19,103 నమూనాలు పరీక్షించామని తెలిపింది.