ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 1,935 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 37 మంది మరణించినట్లు రాష్ర్ట కొవిడ్ కంట్రోల్ రూమ్ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 31,103కి చేరింది. మొత్తం పాజిటివ్ కేసుల్లో 14,274 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. కరోనా మహమ్మారి నుంచి 16,464 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ర్ట వ్యాప్తంగా 365 మరణాలు సంభవించాయని అధికారులు తెలిపారు.
గడిచిన 24 గంటల్లో అనంతపూర్ లో ఆరుగురు, కర్నూల్, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నలుగురి చొప్పున, చిత్తూరు, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురి చొప్పున, కడప, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున మరణించారు.