ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీగా ఎన్నికైన డొక్కా మాణిక్యవరప్రసాద్ మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు. మండలీ అధికారులు ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. గత నెలలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు వైఎస్సార్ పార్టీ తరుపున ఒక్కరే డొక్కా నామినేషన్ వేయంగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ ఎమ్మెల్సీగా ఎన్నికైన తాను తన పదవికి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్లో చేరాను.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనకు మరోసారి మండలికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. శాసనమండలి ద్వారా ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేయడం సంప్రాదాయం కాదని ప్రతిపక్ష సభ్యులకు సూచించారు. తాను శాసన సభ్యుడిగా, మండలి సభ్యుడిగా ఏనాడు కూడా సభకు గైర్హాజరు కాలేదని అన్నారు. శాసన మండలి ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇచ్చే విధంగా ఉండాలే తప్పా వేరే రకంగా ఉపయోగించుకోరాదని సూచించారు.
ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ జంగా కృష్ణామూర్తి తదితరులు పాల్గొన్నారు.