దేశంలో 24 గంటల్లో 29,429 పాజిటివ్‌ కేసులు

దేశంలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతున్నది. గత పది రోజులుగా ప్రతిరోజు రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 29,429 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 582 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 9,36,181కు చేరింది. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 3,19,840 యాక్టివ్‌ కేసులు ఉండగా, వైరస్ బారినపడినవారిలో 5,92,032 మంది బాధితులు కోలకున్నారు. ఈ వైరస్‌ వల్ల ఇప్పటివరకు 24,309 మంది మరణించారు. 
జూలై 14 వరకు 1,24,12,664 నమూనాలను పరీక్షించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్‌) ప్రకటించింది. నిన్న ఒకే రోజు  3,20,161 మందికి కరోనా పరీక్షలు చేశామని తెలిపింది.