ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కమిటీ

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుకు కమిటీని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.. దీనికోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో బుధవారం మంత్రివర్గ సమావేశం జరిగింది ఈ సమావేశంలో పలు కీలక విషయాలపై చర్చించి ఆమోదం తెలిపారు.కాగా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను పునర్వవ్యవస్థికరించి 25 జిల్లాల ఏర్పాటుకు చర్చకు రాగా 26వ జిల్లాగా అరకుపై కూడా చర్చ వచ్చిందన్నారు. కొత్త జిల్లాలతో స్థానిక ఎన్నికలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆయన స్పష్టం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటులో పాలనాపరంగా ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కమిటీకి సూచించినట్లు పేర్కొన్నారు.

కొత్త జిల్లాలతో స్థానిక ఎన్నికలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని మంత్రి స్పష్టం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటులో పాలనాపరంగా ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని ఆయన తెలిపారు.

రాయలసీమ కరవు నివారణ కోసం రూ.40వేల కోట్లతో కార్పొరేషన్‌,ఫిష్‌ ఫీడ్‌ క్వాలిటీ కంట్రోల్‌ చట్టం కోసం ఆర్డినెన్స్‌ తేవాలని క్యాబినేట్‌ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని  మంత్రి వర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. ఆక్వా రంగంలో నాణ్యమైన మేత తయారీ కోసం ఆర్డినెన్స్‌ తెస్తున్నామని అన్నారు. ఇసుక అక్రమ రవాణ నివారణకు శాండ్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు నిర్ణయించామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని వైద్యశాఖలో 9712 మంది సిబ్బంది నియమాకానికి  క్యాబినేట్‌ ఆమోదం తెలిపిందని వివరించారు.

 గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీల అభ్యర్థుల ఖరారుపై సీఎం నిర్ణయిస్తారని వెల్లడించారు.  రాష్ట్రంలోని కోవిడ్‌ ఆస్పత్రులో వైద్యపరంగా ఎక్కడా సమస్యలు లేవని అన్నారు. రాజదాని తరలింపు అంశం మంత్రివర్గంలో చర్యకు రాలేదని ఆయన మంత్రి నాని తెలిపారు.