గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కమెడియన్ సుడిగాలి సుధీర్, బిగ్ బాస్ ఫేమ్ భాను శ్రీ విసిరిన గ్రీన్ చాలెంజ్ ను స్వీకరించి వారి నివాసలలో మొక్కలు నాటిన జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను , ఆటో రామ్ ప్రసాద్ఈ . సందర్భంగా ఇద్దరు మాట్లాడుతూ ఆకుపచ్చ ప్రపంచం కోసం కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థను అభినందించినారు. ఎంపీ సంతోష్ కుమార్ ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కమెడియన్ లు గెటప్ శ్రీను , ఆటో రామ్ ప్రసాద్ పిలుపునిచ్చారు.అనంతరం గెటప్ శ్రీను మరోక ముగ్గురికి పూరి జగన్నాథ్ , ఆకాష్ పూరి, ఛార్మి, ఆటో రామ్ ప్రసాద్ మరొక ముగ్గురికి యాంకర్ ప్రదీప్ , పారా బ్యాట్ మెంటన్ ప్లేయర్ మానసి జోషి, జబర్దస్త్ కమెడియన్ హైపర్ అది లకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు..
ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో.ఫౌండర్ రాఘవ, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి కిషోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు