తెలంగాణలో కొత్తగా 1,597 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో బుధవారం కొత్తగా 1,597 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే 796 రికార్డయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 212, మేడ్చల్‌ మల్కాజిగిరి 115, సంగారెడ్డి 73, నల్లగొండ 58, వరంగల్‌ అర్బన్‌ 44, కరీంనగర్‌ 41, కామారెడ్డి 30, సిద్దిపేట 27, మంచిర్యాల 26, మహబూబ్‌నగర్‌ 21, పెద్దపల్లి 20, మెదక్‌ 18, జయశంకర్‌ భూపాలపల్లి 15, సూర్యాపేట జిల్లాల్లో 14 కేసులు, యాదా ద్రి భువనగిరి, నిజామాబాద్‌ 13 చొప్పున, జనగామ 8, భద్రాద్రి కొత్తగూడెం 7, ఖమ్మం, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 6 చొప్పున, మహబూబాబాద్‌, నారాయణపేట, వికారాబాద్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాల్లో 5 చొప్పున, జోగుళాంబ గద్వా ల, ములుగు జిల్లాల్లో 4 చొప్పున, ఆదిలాబాద్‌ 1 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొ త్తం 2,08,666 పరీక్షలుచేయగా, 39,342 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. బుధవారం ఒక్కరోజే 11 మంది చనిపోగా, మొత్తం మృతుల సంఖ్య 386కు చేరింది.