నూతన సచివాలయం నిర్మాణానికి అడుగడుగునా అడ్డుపతుడున్న కాంగ్రెస్ కి మరో భంగపాటు ఎదురైంది. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి చుక్కెదురైంది. సచివాలయం కూల్చివేతపై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ని సుప్రీంకోర్టు కొట్టివేసింది.
తెలంగాణ సచివాలయం కూల్చివేతపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జూన్ 29న హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని జీవన్‌రెడ్డి కోరారు. సచివాలయ కూల్చివేత అంశంపై జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్.కె కౌల్, జస్టిస్ ఎం.ఆర్ షాతో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణను చేపట్టింది. కోర్టు తీర్పులతోనైనా ప్రతిపక్షాలు కళ్లు తెరవాలని ప్రజలు కోరుకుంటున్నారు.