తెలంగాణలో కొత్తగా మరో 1478 కరోనా పాజిటివ్ కేసులు

రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా మరో 1,478 కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 42,496కు చేరింది. ఇందులో 13,389 యాక్టివ్‌ కేసులుండగా, 28,705 మంది కోలుకున్నారు. కరోనా బారినపడ్డ వారిలో కోలుకున్న వారు 68 శాతం ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,37,817 శాంపిల్స్‌ పరీక్షించగా ఇందులో 18 శాతం పాజిటివ్‌ వచ్చాయి. శుక్రవారం ఒక్కరోజే 15,124 శాంపిల్స్‌ పరీక్షించినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం ఏడుగురు మరణించడంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 403కు చేరింది.

తాజాగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 806ఉన్నాయి. రంగారెడ్డి 91, మేడ్చల్‌ 82, కరీంనగర్‌ 77, వరంగల్‌ అర్బన్‌ 51, పెద్దపల్లి, నల్గొండలో 35 చొప్పున, కామారెడ్డి 31, సిరిసిల్ల 27, నాగర్‌కర్నూల్, మెదక్‌ 23 చొప్పున, సూర్యాపేట్, సంగారెడ్డిలో 20 చొప్పున, మహబూబ్‌నగర్‌ 19, ఖమ్మం 18, వికారాబాద్‌ 17, మంచిర్యాల 15, నారాయణపేట 14, ఆసిఫాబాద్, మహబూబాబా ద్, భువనగిరి, నిజామాబాద్‌లలో 11 చొప్పున, జనగామ 10, సిద్దిపేటలో 8, జగిత్యాలలో 4, వనపర్తి, భూపాలపల్లి, గద్వాలలో 2 చొప్పున, ములుగు, కొత్తగూడెంలో ఒక్కొక్కటి చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.