ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఫైర్‌సేఫ్టీ పాటించాల్సిందే : విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి

తెలంగాణలో ప్రైవేటు జూనియర్‌ కాలేజీలు తప్పకుండా ఫైర్‌సేఫ్టీ ప్రమాణాలు పాటించాల్సిందేనని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి స్పష్టంచేశారు. జూనియర్‌ కాలేజీల అఫిలియేషన్‌ నిబంధనలు, ఫైర్‌సేఫ్టీ, శానిటైజేషన్‌ వంటి అంశాలపై చర్చించడానికి మంగళవారం అధికారులతో నాంపల్లిలోని ఇంటర్‌బోర్డు కార్యాలయంలో మంత్రి సమావేశమయ్యారు. ఫైర్‌సేఫ్టీకి సంబంధించి 15 మీటర్ల మినహాయింపును ఇప్పటికిప్పుడు రద్దుచేయడం వల్ల రాష్ట్రంలో దాదాపు 1,300 కాలేజీలు ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉన్నదని తెలంగాణ ప్రైవేటు జూనియర్‌ కాలేజీ యాజమాన్యాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గౌరిసతీశ్‌ పేర్కొన్నారు.