కరోనాతో బాలల హక్కుల సంఘం నేత పి.అచ్యుతరావు మృతి

ప్రముఖ బాలల హక్కుల సంఘం నేత పి.అచ్యుతరావు కరోనా‌ బారిన పడి మరణించారు. ఇటీవల కరోనా వైరస్‌ పాజిటివ్ ‌రావడంతో చికిత్స పొందుతున్న ఆయన మలక్ పేట యశోద ఆసుపత్రిలో బుధవారం తుది శ్వాస విడిచారు. అచ్యుత రావు  అకాలమరణంపై పలువురు ప్రజా సంఘ నేతలు, ఇతరులు సంతాపం వ్యక్తం చేశారు.

బాలల హక్కుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడైన అచ్యుతరావు  బాలలు, శిశు హక్కుల సంరక్షణ నిమిత్తం  అనేక పోరాటాలు నిర్వహించిన సంగతి విదితమే.  భార్య అనూరాధతో బాలల హక్కుల సంఘాన్ని స్థాపించిన అచ్యుత రావు  గతంలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ (ఎస్‌సీపీసీఆర్‌)  సభ్యుడుగా పనిచేశారు.