ఏసీబీ వలలో చిక్కిన డీఎంహెచ్ఓ అధికారి

జోగులాంబ గద్వాల జిల్లాలో లంచం తీసుకుంటూ ఓ డీఎంహెచ్ఓ  ఏసీబీ అధికారులకు చిక్కారు. వడ్డేపల్లి మండలంలో మెడికల్ ఆఫీసర్ గా పని చేస్తున్న డాక్టర్ మంజులకు కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ సీటు వచ్చింది. దీతో పీజీలో జాయినింగ్ కోసం రిలీవింగ్ ఆర్డర్ కావాలని దరఖాస్తు చేసుకుంది. ఆమెకు రిలీవింగ్ ఆర్డర్ ఇచ్చేందుకు గద్వాల డీఎంహెచ్ఓ అధికారి డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో మంజుల మహబూబ్ నగర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. గురువారం గద్వాల పట్టణంలో ఉన్న డీఎంహెచ్ఓ ఆఫీసులో మంజుల ఏడు వేల నగదును డీఎంహెచ్ఓకు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ దాడుల్లో ఏసీబీ డీఎస్పీ కృష్ణాగౌడ్, సీఐ ప్రవీణ్ కుమార్, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.