ఏపీలో ఒకేరోజు రికార్డుస్థాయిలో 7998 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24గంటల్లో రికార్డు స్థాయిలో 7998 కేసులు నమోదు అయ్యాయి. 61 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 884కు చేరుకుంది.

తూర్పు గోదావరి జిల్లాలో 14 మంది, గుంటూరు, కర్నూలులో 7గురు చొప్పున, కృష్ణా, శ్రీకాకుళంలో ఆరుగురు చొప్పున కరోనాతో మృతి చెందారు. విజయనగరం, విఖాపట్నంలో ఐదుగురు, చిత్తూరు, ప్రకాశం, పశ్చిమగోదావరిలో ముగ్గురు,కడప, అనంతపురంలో ఒక్కొక్కరు చొప్పున కరోనా కాటుకు బలయ్యారు.రాష్ట్రంలోని 13 జిల్లాలో 72711 మందికి కరోనా నిర్ధారణ కాగా 37555 మంది కోలుకున్నారు. మరో 34,272 మంది చికిత్స పొందుతున్నారు.   మూడు జిల్లాలు అనంతపురం, గుంటూరు, తూర్పుగోదావరిలో జిల్లాలో కరోనా బారిన పడ్డ వారి సంఖ్య వెయ్యికి దాటింది.