మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌ 10 లక్షల విరాళం

మంత్రి కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌ తన ఔదార్యం చాటుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్‌ ఏ స్మైల్‌ పేరుతో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించాలని గతేడాది మంత్రి కేటీఆర్‌ పార్టీ శ్రేణులకు, అభిమానులకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా నవీన్‌కుమార్‌ ఈ ఏడాది కేటీఆర్‌ పుట్టినరోజును పురస్కరించుకొని పేదలకు తక్కువ ఖర్చుతో వైద్యసేవలను అందిస్తున్న శివానంద పునరావాస కేంద్రానికి చెందిన కూకట్‌పల్లిలోని రాందేవ్‌రావు వైద్యశాలకు రూ. 10,01,116 విరాళంగా అందజేశారు. ఆ నిధులతో వైద్యశాలలో వెంటిలేటర్లు, అత్యవసర విభాగంలో 5 పారాపేషెంట్‌ మానిటరింగ్‌ పరికరాలను ఏర్పాటుచేయాలని సూచించారు. దివ్యాంగులైన చిన్నారులకు సేవలందిస్తున్న ఖైరాతాబాద్‌లోని శంకర్‌ ఫౌండేషన్‌ భవన మరమ్మతులు, సుందరీకరణకు అయ్యే ఖర్చును విరాళంగా అందజేసి దాతృత్వాన్ని చాటుకున్నారు.