తెలంగాణలో 50 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 50 వేలు దాటింది. గురువారం కొత్తగా 1,567 మందికి పాజిటివ్‌ నిర్ధా రణ అయింది. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 50,826కి చేరింది. ఇందులో 39,327 మంది కోలుకోగా.. 11,052 యాక్టివ్‌ కేసులున్నాయి. కరోనాతో గురువారం మరో 9 మంది మృతిచెందగా.. రాష్ట్రంలో మరణాల సంఖ్య 447కి పెరిగింది.

తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరి ధిలో 662 ఉండగా.. రంగారెడ్డిలో 213, వరంగల్‌ అర్బన్‌లో 75, సిరిసిల్లలో 62, మహబూబ్‌నగర్‌లో 61, నాగర్‌కర్నూల్‌ లో 51, నల్లగొండలో 44, సూర్యాపేట్‌లో 39, నిజామాబాద్, కరీంనగర్‌లలో 38 చొప్పున, మేడ్చల్‌లో 33, సంగారెడ్డిలో 32, మెదక్‌లో 27, భూపాలపల్లిలో 25, జనగామ, వరంగల్‌ రూరల్‌లో 22 చొప్పున, మహబుబాబాద్‌లో 18, ఆదిలాబాద్, కామారెడ్డి, ములుగులో 17 చొప్పున, జగిత్యాలలో 14, ఖమ్మంలో 10, సిద్దిపేట్‌లో 9, వికారాబాద్‌లో 5, ఆసిఫాబాద్, యాదాద్రిలో 4 చొప్పున, పెద్దపల్లి, కొత్తగూడెం, గద్వాలలో 2 చొప్పున, నిర్మల్, మంచిర్యాలలో ఒక్కో కేసు ఉన్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా గురువారం 13,367 శాంపిల్స్‌ పరిశీలించగా.. ఇప్పటివరకు మొత్తం 3,22,326 శాంపిల్స్‌ పరీక్షించినట్టు వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. రాష్ట్రంలో ప్రతి పది లక్షల మంది జనా భాకు 8,058 పరీక్షలు చేసినట్లు వెల్లడించింది.