గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఖమ్మం జిల్లాలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పార్శిబందం అందుకున టాస్క్ ఫోర్స్ సీఐ వెంకటస్వామి, ఎస్ఐ రఘు తమ సిబ్బందితో కలసి పట్టుకున్నారు. తనిఖీలో 25 క్వింటాల రేషన్ బియ్యం తరలిస్తునట్లు గుర్తించి ఆటో, బియ్యాన్ని సీజ్ చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు తెలిపారు. తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ తెలిపారు. ఎవరైనా అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
