తెలంగాణలో కొత్తగా 1,593 కరోనా పాజిటివ్‌ కేసులు

 తెలంగాణలో కరోనా వైరస్‌ ఉధృతి తగ్గడం లేదు. కరోనా విజృంభణ ధాటికి ప్రజలు విలవిలలాడిపోతున్నారు. రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1,593 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 8 మంది చనిపోయారు. తెలంగాణలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 54,059కి చేరగా, ఇప్పటి వరకు కరోనాతో 463 మంది మృతి చెందారు. కరోనా నుంచి కోలుకుని 41,332 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలోని పలు ఆస్పత్రుల్లో 12,264 మంది చికిత్స పొందుతున్నారు.

తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.86 శాతం కాగా, దేశ వ్యాప్తంగా ఆ రేటు 2.3 శాతంగా ఉంది. నిన్న ఒక్కరోజే 15,654 మంది నమూనాలను పరీక్షించగా, 1,593 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ప్రతి 10 లక్షల జనాభాలో 391 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.