లక్ష మొక్కలు నాటే కార్యక్రమంలో చిరంజీవి, డైరెక్ట‌ర్లు

 రాజ్య‌స‌భ‌ ‌స‌భ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్య‌క్ర‌మం ఉద్య‌మంలా కొన‌సాగుతుంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌజ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ అండ్ జూబిలీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ల ఆధ్వర్యంలో జూబ్లీ హిల్స్ క్లబ్ ప్రాంగణంలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభ‌మైంది. 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ సంతోష్ కుమార్ తోపాటు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్లు బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి, ఇత‌ర ప్ర‌ముఖులు పాల్గొన్నారు.  ఈ సంద‌ర్భంగా చిరంజీవి-ఎంపీ సంతోష్ కుమార్ మొక్కల వద్ద సెల్ఫీ దిగారు.