ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 7,627 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 96,298కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 47,645 శాంపిల్స్ పరీక్షించగా.. 7,627 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు పేర్కొంది. నేడు కరోనా నుంచి కోలుకున్న 3,041 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 46,301కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 48,956 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా కరోనాతో 56 మంది మృతి చెందడంతో.. మొత్తం మరణాల సంఖ్య 1,041గా నమోదైంది. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 16,43,319 శాంపిల్స్‌ను పరీక్షించారు.
