బాలానగర్‌లో ఓ ఫార్మా స్యూటికల్ పరిశ్రమలో పేలిన రియక్టర్

బాలానగర్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఐడీఏ గాంధీ పారిశ్రామిక వాడలోని ఓ ఫార్మా స్యూటికల్ పరిశ్రమలో రియక్టర్‌ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చేలరేగాయి. ఈ ఘటనలో నలుగురు కార్మికులకు గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో పేలుడు ధాటికి ఫ్యాక్టరీ మొదటి అంతస్తులోని గోడలు పగిలిపోయాయి. ప్రమాదంపై పోలీసులు, అధికారులు ఆరా తీస్తున్నారు.