నేడు మంత్రుల సమీక్ష

కొవిడ్‌-19, సీజనల్‌ వ్యాధుల నివా రణ చర్యలపై మంగళవారం వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్త్రీ శిశు, గిరిజనసంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ ఉమ్మడి వరంగల్‌ జిల్లా అధికారులతో సమీక్షించనున్నారు. హన్మకొం డ హంటర్‌ రోడ్డులోని సీఎస్‌ఆర్‌ గార్డెన్‌లో ఉదయం 10.30 గంటలకు జరిగే ఈ సమీక్షా సమావేశంలో కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వైద్యా రోగ్య శాఖ అధికారులు పాల్గొననున్నారు.