తెలంగాణలో కొత్తగా 1,610 కరోనా కేసులు నమోదు అయ్యాయి. సోమవారం రాత్రి 8గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఈ కేసులు నమోదు అయ్యాయని రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు. కరోనాతో 9 మంది చనిపోయారని వివరించారు. నిన్న ఒక్కరోజే 15,839 కరోనా పరీక్షలు నిర్వహించామన్నారు.
ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 57,142 కేసులు నమోదు కాగా 42,909 మంది ఆస్పత్రుల్లో కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 13,753 మంది చికిత్సపొందుతున్నారని పేర్కొన్నారు. నిన్న రాత్రి ఒక్కరోజే 803 మంది డిశ్చార్జి అయ్యినట్లు అధికారులు తెలిపారు. మొత్తం రాష్ట్రంలో ఇప్పటి వరకు 830 మంది కరోనా బారిన పడి మృతి చెందారని వైద్యులు వివరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 531 కొత్తగా కేసులు నమోదు అయ్యినట్లు వెల్లడించారు.