ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మకు జీహెచ్ఎంసీ రూ.4వేల జరిమానా విధించింది. ఆయన తెరకెక్కించిన చిత్రం ‘పవర్‌స్టార్’కు సంబంధించిన పోస్టర్లను బహిరంగ ప్రదేశాల్లో అంటించినందుకుగాను జీహెచ్ఎంసీ సెంట్రల్ ఎన్‌ఫోర్స్‌మెట్ సెల్ రామ్‌గోపాల్‌వర్మకు రూ.4,000 చెల్లించాలని చలానా జారీ చేసింది. లాక్డౌన్ అనంతరం మొదటి పోస్టర్, మొబైల్ యాప్‌లో విడుదలయ్యే సినిమాకు సంబంధించి ఫస్ట్పోస్టర్ అంటూ ట్విట్టర్లో రామ్‌గోపాల్‌వర్మ విడుదల చేసిన పోస్ట్‌ను ఓ నెటిజన్ సీఈసీ- ఈవీడీఎం ఖాతాకు జోడిస్తూ ఫిర్యాదు చేశారు.
దీంతో స్పందించిన అధికారులు ఈ నెల 22న జరిమానా విధించారు. చలానాను జూబ్లీహిల్స్, గాయత్రిహిల్స్‌లోని ఆర్జీవీ అడ్రస్‌కు పంపనున్నట్టు ఈవీడీఎం వర్గాలు తెలిపాయి.