ఆంధ్రప్రదేశ్‌లో మరో కెమికల్‌ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం..

ఆంధ్రప్రదేశ్‌లో మరో కెమికల్‌ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం చంద్రపడియ గ్రామంలో ఉన్న వెంకట నారాయణ యాక్టివ్‌ ఇంగ్రీడియంట్స్‌ కెమికల్‌ ఫ్యాక్టరీలో బుధవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో నలుగురు కార్మికులకు గాయాలయ్యాయి. వీరిని నెల్లూరు ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.
బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కాగా విశాఖలో వరుసగా జరుగుతున్న ప్యాక్టరీల్లో వరుసుగా జరుగుతున్న విషవాయువుల లీకేజీలు, అగ్నిప్రమాదాల సంఘటనలు మరువకముందే నెల్లూరు జిల్లాలోని ప్యాక్టరీలో అగ్నిప్రమాదం జరగడం కార్మికవర్గాలో ఆందోళన వ్యక్తం అవుతుంది.