మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

ఆంధ్రప్రదేశ్‌ ఈఎస్‌ఐ స్కాంలో పాత్ర ఉందన్న ఆరోపణల కారణంగా అరెస్టయిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌ను ఏపీ  హైకోర్టు కొట్టివేసింది. ఆయనతో పాటు నిందితులుగా ఉన్న రమేశ్‌కుమార్‌, మాజీ మంత్రి పితాని పీఏ మురళి, సుబ్బారావు బెయిల్‌ను కూడా కొట్టివేసింది.

కార్మికశాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తు అచ్చెన్నాయుడును కొన్ని రోజుల క్రితం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బెయిల్‌ కోసం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసుకోగా బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు వెల్లడించింది.