‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ను స్వీకరించిన శ్రీను వైట్ల

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్  ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రకృతి ప్రేమికులను కదిలస్తుంది. ఒక్కొక్కరుగా మొక్కలు నాటుతూ తమ సన్నిహితులను నామినేట్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా ఇప్పుడు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను గుండెల్లొ పెట్టుకుంటున్నది. ఇందులో భాగాంగా నిర్మాత, నటుడు బండ్ల గణేష్ విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన శ్రీను వైట్ల హైదరాబాద్, జర్నలిస్ట్ కాలనీలోని తన నివాసంలో మొక్కలు నాటారు.

అనంతరం శ్రీను వైట్ల మాట్లాడుతూ.. గత మూడు దశాబ్దాల్లో రాజకీయ నాయకుల నుంచి సమాజానికి ఉపయోగపడే ఇంతమంచి మానవీయ కార్యక్రమాన్ని చూడలేదన్నారు. మొదటిసారిగా సంతోష్ కుమార్ మంచి మనస్సుతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి రూపకల్పన చేశారని కొనియాడారు. వారికి నా అభినందనలు తెలియజేస్తున్నట్టు తెలిపారు.

అనంతరం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడానికి తన వంతు బాధ్యతగా.. టాలీవుడ్ అందాల భామ కాజల్ అగర్వాల్, నటుడు- సమాజ సేవకుడు సోనూ సూద్, టాలీవుడ్ యంగ్ హీరో విష్ణు మంచు, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, టీఎస్ఎండీసీ ఎండీ మల్సూర్, ప్రముఖ రచయిత గోపి మోహన్ ను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు నామినేట్ చేస్తున్నట్టు తెలియజేసారు.